ముంబై : భారత్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ర్టలోనే వెలుగుచూస్తున్నాయి. అంతేకాకుండా పోలీస్ శాఖలోనూ కోవిడ్ కలకలం రేపుతోంది. ఆదివారం 51 ఏళ్ల పోలీస్ ఆఫీసర్‌కు కరోనా సోకి నాసిక్‌లో మరణించారు. దీంతో ఇప్పటివరకు ప్రాణాంతక వైరస్ బారినపడి మరణించిన పోలీసుల సంఖ్య 7కి చేరగా, మొత్తం 779 కరోనా కేసులు పోలీస్ శాఖలో నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లోనే మహారాష్ట్రలో 1165 కరోనా కేసులు వెలుగుచూడగా, మొత్తం నమోదైన కేసుల సంఖ్య 20, 228కి చేరుకుంది.
ఇక లాక్‌డౌన్ నిబంధలనలు ఉల్లంఘించిన వారిపై మొత్తం 96,231 కేసులు నమోదయ్యాయని తేలింది. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి పోలీసులపై దాడులు, వేధింపుల ఘటనలు 200 చోటుచేసుకున్నాయని వెల్లడించారు. ఈ ఘటనలకు సంబంధించి 732 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. ఇదే సమయంలో మహారాష్ట్రలో 30 మంది ఆరోగ్య సిబ్బందిపైనా దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. (24 గంటల్లో 4,213 పాజిటివ్ కేసులు)
Comments
Please login to add a commentAdd a comment