సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మధ్యవర్తిత్వం నెరపుతానన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకులు శ్రీశ్రీ రవిశంకర్ పలు ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముస్లింలు భూమిని బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరారు. ‘అయోధ్య రాముడి జన్మభూమి అయినందున ఈ ప్రదేశంపై హిందువులకు గట్టి సెంటిమెంట్ ముడిపడిఉందని, ముస్లింలకు ఇది కీలక ప్రాంతం కానందున ఇక్కడ నమాజ్ చేసుకోవడం ఆమోదయోగ్యం కాద’ని రవిశంకర్ వ్యాఖ్యానించారు.
ముస్లింలకు అయోధ్య ముఖ్యమైన ప్రదేశం కానందున సదరు స్థలాన్ని హిందువులకు బహుమతిగా ఇవ్వాలని ఆయన సూచించారు. కోర్టు వెలుపల సమస్య పరిష్కారానికి ఈ ప్రతిపాదన ద్వారా మార్గం సుగమమవుతుందన్నారు.సున్నీ, షియా ముస్లిం నేతలను ఇటీవల కలుసుకున్న రవిశంకర్ తాను అయోధ్య వివాద పరిష్కారంపై ప్రభుత్వంతో సంప్రదించడం లేదని, తన ప్రయత్నాలతో అధికార యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయోధ్య వ్యవహారంలో సుప్రీం కోర్టు ఓ వర్గానికి అనుకూలంగా తీర్పు వెలువరిస్తే రక్తపాతం జరుగుతుందని తాను వ్యాఖ్యానించలేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment