
మల్లు లక్ష్మి
సాక్షి, నల్లగొండ టౌన్ : నల్లగొండ పార్లమెంట్ సీపీఎం అభ్యర్థిగా మల్లు లక్ష్మి పేరును ఖరారు చేశారు. బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఆమె తెలంగాణ సాయుధపోరాట యోధులు మల్లు స్వరాజ్యం, మల్లు వెంకటనర్సింహారెడ్డి కోడలు. 1992 సంవత్సరంలో ఆమె ఐద్వా సభ్యురాలిగా చేరి మహిళల సమస్యలపై అనేక ఉద్యమాలను నిర్వహించారు. సూర్యాపేట మండలం రాయినిగూడెం సర్పంచ్‌గా పనిచేశారు. ఐద్వాలో జిల్లా కార్యదర్శిగా ఆల్ ఇండియా కమిటీ సభ్యురాలిగా పనిచేసి 2014 సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలిగా నియామకమయ్యారు. ప్రస్తుతం ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్లు లక్ష్మి పనిచేస్తున్నారు. మల్లు లక్ష్మి ఈనెల 25న తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment