
రాంలీలా మైదాన్‌లో నేడు మోదీ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌కు ప్రచార పర్వం వేడెక్కింది. బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో ఈనెల 12న ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఇక హర్యానా, ఢిల్లీలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు ఆరో దశలోనే పోలింగ్ నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా పలు పార్టీల అగ్రనేతలు ప్రచారంతో హోరెత్తిస్తుండగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రచార హోరు పతాకస్ధాయికి చేరింది.
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని చారిత్రక రాంలీలా మైదాన్‌లో జరిగే ర్యాలీతో పాటు హర్యానాలోని ఫతేహబాద్, కురుక్షేత్రల్లో ప్రచార ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ రాజస్ధాన్‌లోని భిండ్, మురైనా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. మరోవైపు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ ఢిల్లీలో రోడ్డుషోల్లో పాల్గొంటారు.