సాక్షి, బెంగళూరు : ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న గిరీష్ కర్నాడ్.. సోమవారం ఉదయం బెంగళూరులోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. అన్ని భాషల్లోని తన విలక్షన నటనతో ఎప్పటికీ గుర్తుండిపోతారని, ఆయన ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంతి దేవేంద్ర ఫడ్నవీస్ గిరీష్ కర్నాడ్ మృతిపై స్పందిస్తూ.. ప్రసిద్ద నటుడు, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఇండియన్ సినిమా, నాటకరంగం ఓ గొప్ప నటుడ్ని కోల్పోయిందన్నారు. ఆయన మరాఠి నాటకాలను కూడా వేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతిని తెలియజేశారు.
రాజకీయ ప్రముఖులే కాక, సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కమల్ హాసన్, నగ్మ, అనిల్ కపూర్, సిద్దార్థ్, ప్రకాశ్ రాజ్, మాధవన్, సోనమ్ కపూర్, అనిల్ కపూర్ లాంటి సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment