
పారిస్ బయల్దేరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరివెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరిగే వాతావరణ సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ నెల 30న ప్రారంభంకానున్న ఈ సదస్సు డిసెంబర్ 11 వరకు జరుగుతుంది.
సదస్సు ప్రారంభ రోజున భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్నారు. ఉగ్రవాదుల మారణకాండ అనంతరం పారిస్ తొలిసారిగా ఆతిధ్యమిస్తున్న ఈ అత్యున్నత స్థాయి సదస్సుకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సులో ప్రపంచ దేశాలకు చెందిన అత్యున్నత స్థాయి ప్రతినిధులు పాల్గొననున్నారు.