వారణాసి: కోట్లాది మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబమే అస్సీ ఘాట్ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వారణాసికి అస్సీ ఘాట్ ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు. గురువారం అస్సీ ఘాట్ ను సందర్శించిన మోదీ..అక్కడ స్వచ్ఛతను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ ను అన్ని వర్గాల ప్రజలు ముందుకు నడిపిస్తున్నారన్నారు.
స్వచ్ఛ భారత్ కోసం వ్యక్తులు, సంస్థలను ఆహ్వానిస్తున్నాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. దేశ ప్రజలందరికీ మోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.