ఎన్ డీఏకు 320, బీజేపీకి 272 సీట్లు ఖాయం: వైగో | NDA will win 320 seats in Lok Sabha elections: Vaiko | Sakshi
Sakshi News home page

ఎన్ డీఏకు 320, బీజేపీకి 272 సీట్లు ఖాయం: వైగో

Published Mon, Apr 14 2014 9:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

NDA will win 320 seats in Lok Sabha elections: Vaiko

ధర్మపురి: రానున్న లోకసభ ఎన్నికల్లో ఎన్ డీఏకు 320 సీట్లు ఖాయమని ఎండీఎంకే నేత వైగో జోస్యం చెప్పారు. తమిళనాడుతోసహా దేశమంతా మార్పును కోరుతున్నారని వైగో తెలిపారు. ప్రజా వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్, డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలను ఓటర్లు పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

 

ధర్మపురి నియోజకవర్గంలో మాజీ మంత్రి, పీఎంకే అభ్యర్థి అంబుమణి రాందాస్ విజయానికి ప్రచారం చేపట్టిన ఆయన మాట్లాడుతూ..బీజేపీ ఒంటరిగానే 272 సీట్లు గెలుచుకుంటుంది అని అన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా మోడీ హవా కొనసాగుతోందని వైగో అన్నారు. ప్రధాని కావాలని కలలుకంటున్న జయలలిత కలలు కలలుగానే మిగిలిపోతాయని ఆయన ఎద్దేవా చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement