ఆనంద్ భవన్
న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జన్మించిన ఆనంద్‌భవన్‌కు అధికారులు రూ. 4.35 కోట్ల పన్ను నోటీసులు జారీచేశారు. గతంలో నెహ్రూ కుటుంబం నివాసం ఉన్న ఈ ఇల్లు ఢిల్లీలోని ప్రయాగరాజ్‌లో ఉంది. ప్రస్తుతం ఈ భవంతి జవహార్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంది. ఈ ట్రస్ట్‌కు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇంటి పన్ను కట్టకపోవడంతో మున్సిపల్ శాఖాధికారులు రూ.4.35 కోట్ల మేర పన్ను నోటీసులు జారీ చేశారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. గతంలోనే పన్ను నోటీసులు పంపించామని, దానిపై ఎలాంటి స్పందన రానందున పూర్తి సర్వే చేశాకే మళ్లీ నోటీసులు ఇచ్చామన్నారు. 2013 నుంచి పన్ను బకాయి చెల్లించలేదని తెలిపారు. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జవహార్ మెమోరియల్ ఫండ్ అనేది ఓ చారిటబుల్ ట్రస్ట్ అని, దీనికి(ట్రస్ట్‌లకు) పన్ను మినహాయింపు ఉంటుందని వారు చెప్తున్నారు. చారిటబుల్ ట్రస్ట్ అయిన ఆనంద్ భవన్‌కు పన్ను నోటీసులు ఎలా జారీచేస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment