సాక్షి, చెన్నై: విదేశాల్లో ఉగ్రశిక్షణ పొంది భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 14 మంది ఉగ్రవాదుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోమవారం అరెస్ట్ చేసింది. శ్రీలంకలో ఉగ్రదాడుల అనంతరం ఎన్‌ఐఏ అధికారులు తమిళనాడుపై దృష్టి సారించారు. కోయంబత్తూరు, మదురై, సేలం, నాగపట్నం, చెన్నైలో సోదాలు నిర్వహించి ఇస్లామిక్ స్టేట్ మాడ్యుల్ సూత్రధారి అజారుద్దీన్ సహా ముగ్గురిని అరెస్ట్‌చేశారు. వీరిని విచారించగా విదేశాల్లో ఉగ్రశిక్షణ పొందిన 14 మంది తమిళనాడుకు రాబోతున్నట్లు తేలింది.
దీంతో అరబ్ ఎమిరేట్స్ విమానంలో సోమవారం ఢిల్లీలో దిగిన 14 మందిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుండి ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అన్జారుల్లా అనే తీవ్రవాద సంస్థతో వీరికి సంబంధాలున్నాయని, ఆ సంస్థకు నిధులు సమకూరుస్తున్నట్టు అనుమానిస్తున్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా ఈనెల 25 వరకు రిమాండ్ విధించింది. రిమాండ్‌లో భాగంగా వీరిని పుళల్ సెంట్రల్‌జైలుకు తరలించారు. (చదవండి: తమిళనాడులో పేలుళ్లకు కుట్ర?)
Comments
Please login to add a commentAdd a comment