'బీజేపీ అంతగా పొంగిపోనవసరం లేదు' | Nitish Kumar cautioned BJP against going overboard with celebrations of its victory in Assam | Sakshi
Sakshi News home page

'బీజేపీ అంతగా పొంగిపోనవసరం లేదు'

Published Thu, May 19 2016 9:04 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Nitish Kumar cautioned BJP against going overboard with celebrations of its victory in Assam

పాట్నా: అసోం విక్టరీపై అంత పొంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీకి చెప్పారు. అంతగా సంతోషపడేంత విజయం ఏం ఆ పార్టీ స్పందించలేదని పరోక్షంగా చురకలంటించారు. గురువారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో అంతకుముందు అసోంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగా బీజేపీ ఇతర మిత్రపక్షాలను కలుపుకొని విషయం సాధించింది.

ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున సంబురాల్లో మునిగి తేలాయి. ఈ సందర్భంగా నితీష్ స్పందిస్తూ 'బీజేపీ అసోంలో విజయంపట్ల సంబురాల్లో మునిగిపోవాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీలను స్థానిక పార్టీలను కలుపుకొని బీజేపీ విజయంసాధిస్తే.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది' అని అన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్ఛేరి, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో గెలిచిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement