సయ్యద్ అహ్మద్ బుఖారీ
న్యూఢిల్లీ: ఢిల్లీ జమా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ తన వారసుడి ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అహ్వానం పంపలేదు. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి మంది ముస్లిం పెద్దలకు ఆయన ఆహ్వానం పంపారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్కు కూడా ఆహ్వానం పంపారు.
ముస్లిం అభివృద్ధికి మోదీ ఏం చేశారని బుఖారీ ప్రశ్నించారు. మోదీ ఒక వర్గానికి మాత్రమే ప్రధాన మంత్రి అని అన్నారు. బీజేపికి చెందిన ఇద్దరు మంత్రులతోపాటు నలుగురిని ఆహ్వానించినట్లు చెప్పారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలను ఆహ్వానించినట్లు బుఖారీ తెలిపారు.
ఇదిలా ఉండగా, బుఖారీ వ్యాఖ్యలకు బీజేపి అభ్యంతరం వ్యక్తం చేసింది.
**