ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గింపునకు సంబంధించి సామాజిక వెబ్‌సైట్లలో గురువారం దర్శనమిచ్చిన నకిలీ ప్రశ్న, జవాబులపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గింపునకు సంబంధించి సామాజిక వెబ్‌సైట్లలో గురువారం దర్శనమిచ్చిన నకిలీ ప్రశ్న, జవాబులపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. శుక్రవారం ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో మాట్లాడుతూ.. ఎన్‌డీఏ ప్రభుత్వం పదవీ విరమణ వయసును 58కి తగ్గించేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్టు ఈ-మెయిల్ ద్వారా సామాజిక మీడియాలో నకిలీ పార్లమెంట్ ప్రశ్న, తప్పుడు జవాబు దర్శనమిచ్చాయని, ఇది రాజకీయ కుట్ర అని అన్నారు.
విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించిన విద్యుత్ సవరణ బిల్లు-2014ను కేంద్రం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కాగా, ఫ్లోరోసిస్ బారిన పడుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయని కేంద్రం పేర్కొంది. సాగు భారమై ఈ ఏడాది తెలంగాణలో 84 మంది, ఏపీలో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వెల్లడించింది.