ఢిల్లీ: మంచితనానికి, నిజాయితీకి అద్దం పడుతోంది ఈ ఘటన. సోమవారం నగరంలోని మెట్రో రైళ్లో ప్రయాణించిన ఓ మహిళ తన వద్దనున్న లక్ష రూపాయల బ్యాగ్ ను మరిచిపోయింది. అయితే ఆ బ్యాగ్ ను రైల్వే పోలీసులు కంటబడటంతో దాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బాధిత మహిళ రైల్వే పోలీసులను ఆశ్రయించడంతో ఆ బ్యాగ్ ను తిరిగి అప్పగించి శభాష్ అనిపించుకున్నారు.