యాదాది దేశం ప్రవర్తనపై ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ తో సంబంధాలపై పునరాలోచన చేయాలని ప్రధాన మంత్రిని కోరాలని హోంమంత్రికి మాయావతి సూచించారు. రాజ్నాథ్ పర్యటన సందర్భంగా పాకిస్థాన్ లో నిరసన ప్రదర్శనలు నిర్వహించడాన్ని ఖండిస్తున్నట్టు ఎన్సీపీ ఎంపీ మజీద్ తెలిపారు.
ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పాకిస్థాన్ తో ఎలా వ్యవహరించబోతున్నారని సీపీఐ నేత డి. రాజా ప్రశ్నించారు. రాజ్నాథ్ పట్ల ప్రొటోకాల్ పాటించని పాక్ తీరును ఖండిస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ తెలిపారు. పాకిస్థాన్ కు బుద్ధి వచ్చేలా గట్టి ప్రకటన చేయాలని రాజ్నాథ్ కు సూచించారు.