బాంబు దాడి చేయండి: పాక్ ఆర్మీ చీఫ్
ఇస్లామాబాద్: అఫ్ఘానిస్థాన్‌లోని తెహ్రిక్- ఈ - తాలిబన్ చీఫ్ ముల్లా ఫజుల్లా, ఆ సంస్థ రహస్య స్థావరాలపై బాంబు దాడులు చేయాలని పాకిస్థాన్ ఆర్మీ ఛీప్ జనరల్ రషీల్ షరిఫ్ అమెరికాను కోరారు.
అఫ్ఘానిస్థాన్‌లోని కమాండర్ రిజల్యూట్ సపోర్ట్ మిషన్‌కు చెందిన జనరల్ జాన్ నికొల్సన్, అఫ్ఘాన్ మరియు పాకిస్థాన్ వ్యవహారాల అమెరికా ప్రత్యేక ప్రతినిధి రిజర్డ్ ఆల్సన్‌కు మధ్య ఇస్లామాబాద్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ ఈ మేరకు కోరారు. అఫ్ఘానిస్థాన్‌ను కేంద్రంగా చేసుకొని పాక్‌లో కుట్రకు పాల్పడే వారిని తాము ఉపేక్షించబోమని షరీఫ్ స్సష్టం చేశారు. అఫ్ఘానిస్థాన్ లో శాంతి స్థాపనకు చైనా, అఫ్ఘాన్, అమెరికాతో కలిసి పనిచేయడానికి పాకిస్థాన్ కట్టుబడి ఉందని షరీఫ్ స్పష్టం చేశారు.