వాషింగ్టన్: అప్గనిస్థాన్లో వరుస దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థ తాలిబన్కు పాకిస్థాన్ నుంచే సహాయం, ప్రోత్సాహం అందుతుందని అమెరికాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒకప్పుడు పెంటగాన్ లో ఉన్నతాధికారిగా పనిచేసిన డేవిడ్ ఎస్ సిడ్నీ ఆ వివరాలు తెలియజేశాడు. తాలిబన్ భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను అఫ్గనిస్థాన్లో ఉపయోగిస్తుంటుందని, ఇవన్నీ కూడా పాకిస్థాన్ అందించే డబ్బు సాయంతోనే సమకూర్చుకుంటుందని చెప్పారు.
దీంతోపాటు వాటి తయారీ సామాగ్రిని, ఇతర మౌలిక సదుపాయాలను కూడా పాకిస్థాన్ అందించేదని తెలిపారు. దీనివెనుక అసలైన మూలకారణం వేరే ఉందని చెప్పారు. అఫ్గనిస్థాన్ లోని తాలిబన్లలో ఎక్కువమంది పాకిస్థాన్ వాసులే ఉన్నారని, వారి పుట్టుక, పెరుగుదల మొత్తం పాకిస్ధాన్లో ఉంటే అఫ్గనిస్థాన్కు పారిపోయి అక్కడే తాలిబన్లుగా మారుతారని, అనంతరం అక్కడి నుంచే తమ మాతృదేశమైన పాక్ నుంచి విధ్వంస రచనకు అవసరమైన సహాయాన్ని పొందుతారని ఆయన తెలిపారు.
వారు అఫనిస్థాన్ లో అడుగుపెట్టే సమయంలో దాడికి పాల్పడటమో లేక ఆత్మాహుతి దాడి చేసి అఫ్గన్ సేనలను హతమార్చడమో చేస్తారని, ఈ క్రమంలో వారు తప్పించుకోగలిగితే అఫ్గన్ వెళ్లి అక్కడే ఉగ్రవాదులుగా తిష్ట వేస్తారని వివరించారు. దాదాసే పద్నాలుగేళ్లుగా వారికి పాకిస్థాన్ సహాయం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుంటేనే అఫ్గన్ సైన్యం తాలిబన్లను ఎదుర్కోగలదని చెప్పారు.
తాలిబన్లకు పాక్ ఎంకరేజ్మెంట్!
Published Fri, Dec 4 2015 11:01 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
Advertisement