దాడి వెనుక పాక్: రాజ్ నాథ్
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ యురి సెక్టార్‌లోని ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా ఆయన అభివర్ణించారు. ఉగ్రవాదులు దాడి చేసిన తీరు, వారు వాడిన భారీ ఆయుధాలను బట్టి చూస్తే వారికి ఖచ్చితంగా శిక్షణ ఇచ్చి మనమీదికి పొరుగు దేశమే పంపినట్టు స్పష్టమవుతోందని అన్నారు. యురి ఘటన నేపథ్యంలో రాజ్ నాథ్ రష్యా పర్యటనను రద్దు చేసుకొన్నారు. అత్యవసరంగా అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం ఏర్పాటు చేశారు. ఉగ్రదాడి అనంతర పరిస్థితిపై జమ్ముకశ్మీర్ గవర్నర్, ముఖ్యమంత్రితో పరిస్థితిపై చర్చించారు.