లిఫ్ట్, గోడల మధ్య ఇరుక్కుని బాలుడి మృతి
కాకినాడ ఆస్పత్రిలో దుర్ఘటన
కాకినాడ: తన చదువు కన్నవారికి భారం కాకూడదని భావించి డబ్బు సంపాదించాలని పనికి వెళ్లిన బాలుడు కాన రాని లోకాలకు వెళ్లాడు. పుస్తకాలు కొనుక్కోవడానికి పనిలో చేరిన అతడిని లిఫ్ట్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన కాకినాడలో గురువారం జరిగింది. స్థానిక జగన్నాథపురం రామారావుపేటకు చెందిన మోసా రాంబాబు లారీ క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి పెద్ద కుమారుడు అశోక్ మెకానిక్‌గా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు రమేష్ (14) ఎంఎస్‌ఎన్ చార్టీస్ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
పుస్తకాలు కొనుక్కునేందుకు అవసరమైన డబ్బు తానే సంపాదించాలనుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో క్యాంటీన్ కాంట్రాక్టర్ దగ్గర 15 రోజుల కిందట పనిలో కుదిరాడు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రమేష్ నాలుగో అంతస్తులో ప్రమాదవశాత్తు లిఫ్ట్‌కు, లిఫ్ట్ గోడకు మధ్య ఇరుక్కుపోయాడు. రక్తపు చుక్కలు నేలపై పడడం గమనించిన ఆస్పత్రి సిబ్బంది పరిశీలించగా, లిఫ్ట్‌కు, గోడకు మధ్య ఇరుక్కున్న రమేష్ అప్పటికే ప్రాణాలు వదిలాడు. లిఫ్ట్ మెకానిక్‌లు రమేష్ మృతదేహాన్ని బయుటకు తీశారు. ఆస్పత్రి యూజవూన్యం వల్లే రమేష్ మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. అతడి కుటుంబాన్ని ఆదుకుంటావుని ఆస్పత్రి యూజవూన్యం హామీ ఇవ్వడంతో శాంతించారు.