న్యూఢిల్లీ: లోక్పాల్, లోకాయుక్త సవరణ బిల్లును పరిశీలించేందుకు ఇంకాస్త సమయం కావాలని దానికోసం ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ కేంద్రాన్ని కోరింది. గత ఏడాది డిసెంబర్ 8న ఈ బిల్లును లోక్సభలో ప్రవేశ పెట్టారు. అయితే, దానిని పరిశీలించేందుకు ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈ నెల 25నాటికి నివేదిక ఇవ్వాల్సి ఉండగా వారు ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో మరికొంచెం సమయం ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కమిటీలో వివిధశాఖలనుంచి మొత్తం 32 మంది సభ్యులు ఉన్నారు.