నెలకు రూ. 5 వేల పెన్షన్‌పై కవిత
న్యూఢిల్లీ: పేదలకు పెద్దమొత్తంలో పెన్షన్ ఇవ్వాలనుకుంటే వారు ప్రభుత్వం ద్వారా పొందే లబ్ధి నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసి నిధిని ఏర్పాటుచేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్రానికి సూచించారు. అసంఘటిత, ప్రైవేటు రంగాల వ్యక్తులకు నెలకు రూ. 5 వేల చొప్పున పెన్షన్ ఉండాలంటూ బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబే శుక్రవారం లోక్‌సభలో ‘జాతీయ కనీస పెన్షన్ హామీ’ పేరుతో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ... తెలంగాణలో వృద్ధులకు ప్రకటించిన రూ. 1000 పెన్షన్ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చన్నారు.
‘‘సభ్యుడు దూబే ప్రతిపాదించిన రూ. 5 వేల పెన్షన్ పథకంలో రాష్ట్రాలు భాగస్వాములు కావొచ్చు. రూ. 50 వేల కోట్ల కార్ఫస్ ఫండ్‌ను కేంద్రం నిధుల నుంచి తీసుకోవాలంటున్నారు. కానీ, ఇది సాధ్యం కాకపోవచ్చు. ఈ రూ. 50 వేలకోట్ల ఫండ్‌ను మనమే తయారుచేసుకోవచ్చు. ఉదాహరణకు జాతీ య గ్రామీణఉపాధి హామీ నిధుల నుంచి ప్రతి ఒక్కరికి రూ. 150 వేతనం ఇస్తున్నారు. వీటిలో రూ. 10 లేదా రూ. 15లు పొదుపు చేసుకునేలా కేంద్రం ప్రోత్సహించి నిధిని సృష్టించవ చ్చు. దాన్నుంచి వారికి పెన్షన్ ఇవ్వొచ్చు’’ అని ఆమె అన్నారు.
‘ఉపాధి హామీ’ నుంచి పెన్షన్ నిధి
Published Sat, Jul 26 2014 1:04 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement