సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు తీవ్ర విమర్శలు, దాడుల వరకు వెళ్లింది తెలంగాణ రాజకీయం. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ ఆరోపణలు చేయడంతో కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక, టీఆర్‌ఎస్ శ్రేణులు అరవింద్ ఇంటిని ముట్టడించి ఇంట్లో ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు.
ఇక, టీఆర్‌ఎస్ ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా?. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మలు దాడులతో ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నారు. బీజేపీ సహనాన్ని చేతకానితనం అనుకోవద్దు. మా కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ఘటనపై డీకే అరుణ కూడా స్పందించారు. డీకే అరుణ మాట్లాడుతూ.. దాడికి కారణమైన కవితపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడుల నేపథ్యంలో హైదరాబాద్, ఆర్మూర్‌లోని అరవింద్ నివాసాల వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment