సాక్షి, న్యూఢిల్లీ : రూ 3 లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశామని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పార్లమెంట్‌లో శుక్రవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన గోయల్ జీడీపీ వృద్ధిరేటులో గణనీయ పురోగతి సాధిస్తున్నామన్నారు.
మోదీ సర్కార్ దేశ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరిచిందన్నారు. 2022లోగా నవభారత్‌ను చూడబోతున్నామని చెప్పుకొచ్చారు. ధరల నడ్డివిరిచి సామాన్యుడికి ఊరట కల్పించామన్నారు. అవినీతిరహిత పాలనను తీసుకువచ్చామన్నారు. నాలుగేళ్లలో 1.53 కోట్ల ఇళ్లు నిర్మించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment