ఒమర్ అబ్దుల్లా (ఫైల్ ఫోటో)
శ్రీనగర్ : దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒమర్ అబ్దుల్లా మామయ్య డా. మహ్మద్ అలీ మట్టూ ఆదివారం రాత్రి తీవ్ర అనారోగ్యం కారణంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా షేర్ చేసిన ఓమర్ తన బంధువులు, స్నేహితులనుద్దేశించి కీలక ట్వీట్ చేశారు. కరోనా వైరస్ తో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా ఎవ్వరూ అధిక సంఖ్యలో గుమిగూడవద్దని, నిబధనలను పాటించాలని కోరారు. మామయ్య అలీ ఇంటి ముందుగానీ, లేదా శ్మశాన వాటికకు వద్దకుగానీ అధిక సంఖ్యలో గుమిగూడవద్దని కోరారు. ఈ కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. ఇంటి నుంచి చేసే ప్రార్థనల ద్వారానే ఆయన ఆత్మకు శాంతి లభిస్తుందని ఒమర్ ట్వీట్ చేశారు.
డా. మహ్మద్ అలీ మృతిపై , వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అలాగే ఒమర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ శోక సమయంలో కూడా ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడవద్దని తీసుకున్న అభినందనీయమని పేర్కొన్నారు. తద్వారా కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న యుద్ధానికి మరింత శక్తిని అందించారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధాని మోదీ ట్వీట్ కు ఒమర్ అబ్దుల్లా కూడా మర్యాదపూర్వకంగా సమాధానమిచ్చారు.
Condolences to you and the entire family, @OmarAbdullah. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) March 30, 2020
In this hour of grief, your call to avoid any large gathering is appreciable and will strengthen India’s fight against COVID-19. https://t.co/2xz814elbq
Comments
Please login to add a commentAdd a comment