సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ దివంగత నేత అరుణ్‌జైట్లీ కుటుంబసభ్యులను ప్రధాని నరేంద్రమోదీ పరామర్శించారు. ఢిల్లీలోని జైట్లీ నివాసానికి వెళ్లిన మోదీ... ఆయన భార్య సంగీత, కుమారుడు రోహన్, కుమార్తె సొనాలిలను ఓదార్చారు. జైట్లీతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మోదీతో ఉన్నారు. విదేశీ పర్యటన కారణంగా జైట్లీ అంత్యక్రియలకు ప్రధాని హాజరుకాలేకపోయారు. మరణవార్త తెలిసిన వెంటనే జైట్లీ కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే జైట్లీ నివాసానికి వెళ్లారు. బీజేపీ సీనియర్ నేతగా, గత కేబినెట్‌లో ఆర్థిక, రక్షణమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన అరుణ్‌జైట్లీతో ప్రధాని మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment