ప్రధాని నరేంద్రమోదీ రెండు కొత్త పుష్పాలకు నామకరణం చేశారు. 'వ్యవసాయం, రైతు సంక్షేమం'పై సోమవారం సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ లో జరిగిన జాతీయ సదస్సుకు హాజరైన సందర్భంగా మోదీ మూడు కొత్త రకాల పూలమొక్కలను ఆవిష్కరించారు.
గ్యాంగ్ టక్: ప్రధాని నరేంద్రమోదీ రెండు కొత్త పుష్పాలకు నామకరణం చేశారు. 'వ్యవసాయం, రైతు సంక్షేమం'పై సోమవారం సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ లో జరిగిన జాతీయ సదస్సుకు హాజరైన సందర్భంగా మోదీ మూడు కొత్త రకాల పూలమొక్కలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిక్కిం ఆర్గానిక్ మిషన్ బుక్ లెట్ ను కూడా ఆవిష్కరించారు.
అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన పూల మొక్కల ప్రదర్శనా క్షేత్రంలో కలియతిరిగిన మోదీ అనంతరం కొత్తగా అభివృద్ధి చేసిన మూడు పూల మొక్కలను ఆవిష్కరించి వాటిలో రెండు పూల మొక్కలకు సింబిడియం సర్దార్, లైకాస్ట్ దీన్ దయాల్ అని పేరు పెట్టారు. ఇక మూడో పూలమొక్కకు సిక్కిం ముఖ్యమంత్రి సింబిడియం నమో అని పేరు పెట్టారు.