సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని సహాయ నిధి నుంచి హైదరాబాద్ ఎ.ఎస్.రావునగర్ ప్రాంతంలోని గీతానగర్‌కు చెందిన కవలలకు కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్స కోసం రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం సంబంధిత ఆసుపత్రికి లేఖ రాసింది. గీతానగర్ నివాసి ఎం.వి.ఎల్.నారాయణ తన ఆరేళ్ల కవల పిల్లలు సిరి తాన్సీ, కార్తికేయలకు కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్స అందించాల్సి ఉందని మల్కాజిగిరి ఎంపీ సి.హెచ్.మల్లారెడ్డికి విన్నవించారు.
దీంతో ప్రధాన మంత్రి జాతీయ రిలీఫ్ ఫండ్ నుంచి సాయం కోరుతూ ఎంపీ మల్లారెడ్డి ప్రధానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో వీరికి చికిత్స నిమిత్తం రూ.3 లక్షల చొప్పున సాయం చేసేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలుపుతూ జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి ప్రధాన మంత్రి కార్యాలయం లేఖ రాసింది.
పీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి కవలలకు సాయం
Published Sun, Dec 4 2016 4:00 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement