న్యూఢిల్లీ: మయన్మార్లో భారత సైన్యం దాడులు జరిపి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన మరుసటిరోజు నెలకొన్న తాజా పరిస్థితుల్ని సమీక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ మేరకు మయన్మార్ కు బయలుదేరి వెళ్లాల్సిందిగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ను ఆదేశించారు. తాజా పరిస్థితులపై సమాచార సేకరణతోపటు పలువురు కీలక వ్యక్తులతో జితేంద్ర చర్యలు జరుపుతారని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఎన్ఎస్సీఎన్- కె (నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ - ఖప్లాంగ్) ఉగ్రవాదులు భారత సైన్యంపై జరిపిన దాడిలో 18 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిని సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. ఘటనకు బాధ్యులైనవారిపై విడిచిపెట్టేది లేదని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మయన్మార్ దళాలతో కలిసి మంగళవారం భారత సైన్యం ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో దాదాపు 20 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా, మయన్మార్ లో భారత సైన్యం చర్యకు రాజకీయ రంగులు పులిమే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
మయన్మార్కు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
Published Wed, Jun 10 2015 11:05 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
Advertisement