'చీపురు' పార్టీలో భగ్గుమన్న విభేదాలు | prasanth bhushan offers resignation for pac post | Sakshi
Sakshi News home page

'చీపురు' పార్టీలో భగ్గుమన్న విభేదాలు

Published Wed, Mar 4 2015 3:26 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

'చీపురు' పార్టీలో భగ్గుమన్న విభేదాలు - Sakshi

'చీపురు' పార్టీలో భగ్గుమన్న విభేదాలు

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారం చేపట్టి పట్టుమని పదిరోజులు అయ్యిందో, లేదో.. అప్పుడే ఆ పార్టీలో విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి చర్చ మొదలైన కొన్నాళ్లకే పార్టీ జాతీయ కన్వీనర్ పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. పీఏసీ పదవికి తానూ రాజీనామా చేస్తానని పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. పీఏసీ భేటీకి ఆయనతో పాటు సీనియర్ నాయకుడు యోగేంద్ర యాదవ్ కూడా గైర్హాజరయ్యారు.

ఈ ఉదంతంతో పార్టీ నాయకత్వం ఎటు పోతోంది, పార్టీ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ కేవలం ముఖ్యమంత్రి పదవికే పరిమితం అయిపోతే ఇక పార్టీని ఎవరు నడిపిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల ఆమోదం ఉన్నా కూడా పార్టీని సమైక్యంగా నడిపించలేరా అన్న సందేహాలు వస్తున్నాయి. పార్టీ భవితవ్యంపై కార్యకర్తల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఉనికిని చాటుకోవాలని అనుకుంటున్నా, మరోవైపు నాయకులు ఒక్కొక్కరుగా చేజారిపోతుండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement