న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సోమవారం ప్రత్యూష్ సిన్మా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కృష్ణా రావు, రాజీవ్ శర్మ పాల్గొన్నారు.
ఇరు రాష్ట్రాలకు ఐఏఎస్ అధికారుల పంపిణీ గురించి చర్చించారు. పలు అధికారుల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఈ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఇరు రాష్ట్రాలకు కేటాయించిన అధికారుల పరస్పర మార్పిడి, భార్యాభర్తల అంశాలను నివేదించారు.
ముగిసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం
Published Mon, Jan 19 2015 6:35 PM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM
Advertisement