అహ్మదాబాద్: దళితులపై దాడుల పరంపర ఆగడం లేదు. గుజరాత్‌లో మరోసారి గోవు వివాదం రగులుకుంది. తమ పొలంలో చనిపోయిన గోవు కళేబరాన్ని తీసేందుకు నిరాకరించిన ఓ దళిత గర్భిణి, ఆమె భర్త, మరో వ్యక్తిపై కొందరు అగ్రకులస్తులు దాడి చేశారు. వారిని తీవ్రంగా గాయపరచడంతో ఆస్పత్రి పాలయ్యారు. బనస్కంత జిల్లాలోని అమినఖగఢ్ తాలూకా కర్జా గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
సంగీత రణవాసియా (25), నిలేశ్ రనవాసియా దళిత దంపతులను దర్బార్ అగ్రకులస్తులు కొట్టారని స్థానికులు తెలిపారు. ఇప్పుడు తాము ఆవు కళేబరాలను తొలగించడం లేదని చెప్పినందుకు దాడి చేశారని బాధితులు వివరించారు. తాము చెప్పిన మాట వినవా అంటూ ఓ పదిమంది అతడిపై దాడి చేస్తుండగా సంగీత అడ్డుపడబోయింది. దీంతో ఆమెపై కూడా చేయిచేసుకున్నారు. దీంతో వారంతా ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చింది. నిందితులపై పోలీసులు కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.
దళిత గర్భిణిపై దాడి
Published Sun, Sep 25 2016 8:30 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
Advertisement
Advertisement