ప్రియాంకా చోప్రా
ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఛాలెంజ్ని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా స్వీకరించారు. బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసే 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ఏడాదికి వంద రోజులు పాల్గొన్నవలసిందిగా ప్రజలకు మోదీ పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సినిమా స్టార్లను కూడా ఆయన ఆహ్వానించారు.
మోడీ ఆహ్వానించినవారిలో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ప్రియాంకా చోప్రాలతపోపాటు శశిథరూర్, సచిన్ టెండుల్కర్, తారక్ మెహతా, అనీల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు.
ప్రధాని మోదీ పిలుపునకు ప్రియాంక ట్విట్టర్లో స్పందించారు. ప్రధాని చేపట్టిన కార్యక్రమానికి తన మద్దతు తెలిపారు. ప్రధాని ఛాలెంజ్ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇది చాలా మంచి ఆలోచనగా ప్రియాంక పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తమ సహాయసహకారాలు అందించవలసిందిగా తన అభిమానులను కూడా ఆమె ప్రోత్సహించారు.
***