
ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం పొడిగింపు
దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధాన్ని ఒకరోజు పాటు పొడిగిస్తూ భారతీయ ఎలక్షన్ కమిషన్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్‌పోల్స్‌ను ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ మధ్య వెల్లడించకూడదని ఈసీ గతంలో ఆదేశాలు జారీ చేసింది. తాజాగా అలాపూర్, కర్ణప్రయాగ్‌లలో పోటీ చేస్తున్న అభ్యర్థులు హఠాన్మరణం చెందడంతో మార్చి 9 వరకూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకూడదని పేర్కొంది.