ఆమ్ ఆద్మీ క్యాంటీన్లు, ఆస్తి పన్ను మాఫీ
పంజాబ్ ఎన్నికల మేనిఫెస్టో వెల్లడించిన ఆప్
చండీగఢ్: తాము అధికారంలోకి వస్తే అమృత్‌సర్, ఆనంద్‌పూర్ సాహెబ్‌లను పవిత్ర నగరాలుగా ప్రకటిస్తామని, దళితున్ని డిప్యూటీ సీఎం చేస్తామని పంజాబ్ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ హామీనిచ్చింది. జిల్లా, సబ్ డివిజన్ లలో ఆమ్ ఆద్మీ క్యాంటీన్లు ఏర్పాటు చేసి రూ.5కు ఒక పూట భోజనం అందజేస్తామని, నివాసాలకు ఆస్తి పన్ను మాఫీ చేస్తామని ప్రకటించింది.
పంజాబ్‌లో ఎన్నికల బరిలో దిగిన ఆప్.. శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. దళితులు, పేద కుటుంబాలు, ఉద్యోగులు, రైతులు, మహిళల సంక్షేమానికి ఎజెండాలో ప్రముఖ స్థానం కల్పించామని పార్టీ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంది.