
మీ ఐదేళ్ల అసమర్థ, అహంకారపూరిత పాలన మా రైతుల జీవితాలను నాశనం చేసింది.
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. నరేంద్ర మోదీ అసమర్థత కారణంగా రైతుల జీవితాలు దుర్భరమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న, సన్నకారు రైతులకు ఏటా 6 వేల ఆర్థిక సాయం అందిస్తామనడం రైతులను అవమానపరచడమే అని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
ఈ మేరకు.. ‘డియర్ నమో.. మీ ఐదేళ్ల అసమర్థ, అహంకారపూరిత పాలన మా రైతుల జీవితాలను నాశనం చేసింది. ఇప్పుడేమో రోజుకు 17 రూపాయలు ఇస్తామనడం రైతులను, వారి శ్రమను అవమానించడమే’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాగా శుక్రవారం ఆర్థిక మంత్రి(తాత్కాలిక) పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశంలోని చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ అనే కొత్త పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదించింది. తద్వారా ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏటా 6 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ ఫథకం లక్ష్యం.
Dear NoMo,
— Rahul Gandhi (@RahulGandhi) February 1, 2019
5 years of your incompetence and arrogance has destroyed the lives of our farmers.
Giving them Rs. 17 a day is an insult to everything they stand and work for. #AakhriJumlaBudget