తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మొండిచేయి చూపారు. 2016-17 సంవత్సరానికి ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకే నిరాశ ఎదురయింది. ఒక్క కొత్త రైలు సర్వీసు దక్కలేదు. సుదీర్ఘకాలంగా ఉన్న ప్రతిపాదనలను పక్కన పెట్టేసింది.
తెలంగాణ సర్కార్ భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని మాత్రమే రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్ పొడిగించాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తామని హామీయిచ్చారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ ఏర్పాటుకు మోక్షం లభించలేదు. విశాఖను రైల్వే జోన్ గా ప్రకటించాలన్నా ప్రధాన డిమాండ్ ను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు.