'గుర్మీత్‌ను ఖైదీలే చంపేలా ఉన్నారు' | Ramrahimsingh would be killed by inmates: Somu Pandit | Sakshi
Sakshi News home page

'గుర్మీత్‌ను ఖైదీలే చంపేలా ఉన్నారు'

Published Fri, Sep 8 2017 7:44 PM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

'గుర్మీత్‌ను ఖైదీలే చంపేలా ఉన్నారు'

'గుర్మీత్‌ను ఖైదీలే చంపేలా ఉన్నారు'

హర్యానా: రోహతక్‌ జైలులో డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు ప్రాణహానీ ఉందని సోమూ పండిట్‌ అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు. అదే జైలులో ఇతడు సహచర ఖైదీగా ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా జైలులో గుర్మీత్‌ పరిస్థితి గురించి చెబుతూ ఆయనను ఒంటరిగా వదిలేస్తే సహచర ఖైదీలే ఆయనను హత్య చేసే అవకాశం ఉందని చెప్పాడు.

రామ్‌ రహీమ్‌ సింగ్‌పై జైలులో చాలామంది ఖైదీలు ఆగ్రహంతో ఉన్నారని, వారు ఏ క్షణమైనా ఆయనపై దాడి చేసే అవకాశం లేకపోలేదన్నాడు. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో భద్రత లేకుండా ఒంటరిగా జైలులో ఉంచొద్దని, కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఎప్పటికీ ఉండాల్సిందేనని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement