‘సల్మాన్ డ్రైవర్ వాంగ్మూలం అబద్ధం’ | 'Salman driver lying on the witness' | Sakshi
Sakshi News home page

‘సల్మాన్ డ్రైవర్ వాంగ్మూలం అబద్ధం’

Published Tue, Apr 7 2015 1:07 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

‘సల్మాన్ డ్రైవర్ వాంగ్మూలం అబద్ధం’ - Sakshi

‘సల్మాన్ డ్రైవర్ వాంగ్మూలం అబద్ధం’

ముంబై: కోర్టు ముందు తప్పుడు సాక్ష్యం ఇచ్చిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ డ్రైవర్ అశోక్‌సింగ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కారుతో ఢీకొట్టి ఒకరి మృతికి కారణమైన కేసులో ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది. 2002 సెప్టెంబర్‌లో ఒక రాత్రి బేకరీ షాప్‌లోకి దూసుకెళ్లినప్పుడు కారును నడుపుతోంది సల్మాన్  కాదని, తానే నడుపుతున్నానని  అశోక్‌సింగ్ వాంగ్మూలమివ్వడం తెలిసిందే.

అయితే, అశోక్‌సింగ్ ఇచ్చింది అబద్ధపు సాక్ష్యమనేందుకు ఆధారాలున్నాయని సోమవారం ప్రాసిక్యూషన్ పేర్కొంది. ప్రమాదం జరగడానికి ముందు హోటల్లో తాను ఒక గ్లాస్ మంచినీరు మాత్రమే తాగానని సల్మాన్ చెప్పడం కూడా అబద్ధమేనని వాదించింది. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ కోర్టు హాళ్లోనే ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement