దేశంలో సంచలనం సృష్టించిన శారదా కుంభకోణం కేసులో నిందితుడైన బెంగాల్ మంత్రి మదన్ మిత్రాకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
కోల్ కతా: దేశంలో సంచలనం సృష్టించిన శారదా కుంభకోణం కేసులో నిందితుడైన బెంగాల్ మంత్రి మదన్ మిత్రాకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. మదన్ మిత్రాకు తరుపు న్యాయవాది కౌంటర్ అఫిడవిట్ ను ఇంకా దాఖలు చేయని నేపథ్యంలో తిరిగి ఈ విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
కోట్ల రూపాయల శారదా కుంభకోణం కేసులో మంత్రి మదన్ మిత్రా దాదాపు 11 నెలల తర్వాత కింది కోర్టులో బెయిల్ పొందారు. దీనిని సవాల్ చేస్తూ సీబీఐ అధికారులు కోల్ కతా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించడానికి ముందు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు మిత్రా తరుపు న్యాయవాదిని కోరగా ఆయన ఇంకా కోర్టుకు అందజేయలేదు. ప్రస్తుతం మదన్ మిత్రా గృహ నిర్బంధంలోనే ఉన్న సంగతి తెలిసిందే. శారదా కుంభకోణం కేసులో ఆయనను పోలీసులు గత డిసెంబర్ 12న అరెస్టు చేశారు.