పన్నీర్ కు మరో షాక్.. నలుగురిపై వేటు! | Sasikala expels O Panneerselvam and his supported rebels | Sakshi
Sakshi News home page

పన్నీర్ కు మరో షాక్.. నలుగురిపై వేటు!

Published Tue, Feb 14 2017 4:00 PM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

Sasikala expels O Panneerselvam and his supported rebels

చెన్నై: సుప్రీంకోర్టు తీర్పుతో తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన శశికళ వర్గం.. ఆయనకు మరో షాకిచ్చింది. ఆయనకు మద్ధతిస్తున్న మరో నలుగురు నేతలపై పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ కు గురైన వారిలో విద్యాశాఖ మంత్రి కె.పాండ్యరాజన్, సీనియర్ నేత సి.పొన్నేయన్ సహా సీహెచ్ పాండ్యన్, ఎన్ విశ్వనాథన్ ఉన్నారు.

మహాబలిపురం సమీపంలోని కూవత్తూరులోని గోల్డెడ్ బే రిసార్టుకు వెళ్లి, ఆ నేతలను పన్నీర్ కు మద్ధతు తెలపాలని కోరాలని భావించారు. రిసార్టుకు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీసెందుకు పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటేసినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
పన్నీర్ సెల్వం వర్గంలో ఆయనతో కలిసి ప్రస్తుతం పది మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు (లోక్ సభ, రాజ్యసభ) ఉన్నారు. శశికళ వర్గం మాత్రం పన్నీర్ కు సీఎం కూర్చీ ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు.

అమ్మ జయలలిత ఆశయ సాధన కోసం పనిచేయాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పనులలో నిమగ్నమవ్వాలంటూ  శశికళకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడయిన తర్వాత పన్నీర్ సెల్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై శశికళ వర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. మరోవైపు రిసార్టులో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలు శశికళ వర్గం తరఫున అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా రాష్ట్ర రహదారులు, ఓడ రేవుల మంత్రిగా ఉన్న కె.పళనిస్వామిని ఎన్నుకున్నారు.

తమిళనాడు రాజకీయాలు.. మరిన్ని కథనాలు
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement