leaders suspension
-
బరిలో ఎవరు?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తమ నేతలపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం జిల్లాలో చర్చకు దారి తీసింది. రానున్న సార్వత్రిక ఎన్ని కల్లో వరంగల్ పార్లమెంట్ స్థానంలో ఆ పార్టీ తరఫున ఎవరు బరిలో ఉంటారనే అంశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సస్పెన్షన్ అమలులో ఉన్న ఆరుగురు నేతలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ఇటీవల ప్రకటించింది. ఇందులో జిల్లా నుంచి కాంగ్రెస్ నేత, మాజీ వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఉన్నారు. రెండున్నరేళ్లుగా సస్పెన్షన్ అమలులో ఉండటంతో పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. తాజా నిర్ణయంతో రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అయ్యేందుకు రాజయ్య ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో వరంగల్ పార్లమెంట్ స్థానం జనరల్ నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయ్యింది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అనంతరం 2015లో వచ్చిన ఉప ఎన్నికల్లో మూడోసారి రాజయ్యకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. నామినేషన్ వేసే రోజు న ఆయన ఇంట్లో చోటుచేసుకున్న దుర్ఘటనతో కోడలు సారిక, ముగ్గురు మనుమళ్లు చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజయ్య కు టుంబంపై ఆయన కోడలు తీవ్ర ఆరో పణలు చేసింది. దీంతో కాంగ్రెస్ అధి ష్టానం ఆయన టికెట్‌ను రద్దు చేయడంతోపాటు సస్పెండ్ చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్వే సత్యనారాయణ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనే అంశంపై అనేక పేర్లు వినిపించాయి. అందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి గుండెబోయిన విజయరామారావుతో పాటు బక్క జడ్సన్, నమిండ్ల శ్రీనివాస్, దొమ్మాటి సాంబయ్య తదితరులు ఉన్నారు. ఈ క్రమంలో రాజయ్యపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో మరోసారి చర్చ మొదలైంది. మరోవైపు ఆనవాయితీ ప్రకారం తటస్తుల వైపు కాంగ్రెస్ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయ నేపథ్యం లేని తటస్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉండేందుకు ఆసక్తిగా ఉన్నారు. తటస్థులు.. కాకతీయ యూనివర్సిటీలో పని చేస్తు న్న ఓ అధ్యాపకుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టిం గ్ ఎంపీగా పసునూరి దయాకర్ ఉన్నారు. అంతేకాకుండా ఈ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య పెద్దగానే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగ సంఘాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మరో నేత రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఆ సంఘం నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టికెట్లు సాధించుకునేందుకు పార్టీలో ఉన్న పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రముఖ విద్యాసంస్థల అధినేత పేరు తెరపైకి వచ్చింది. చివరి నిమిషం వరకు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయవచ్చంటూ ప్రచారం జరిగింది. అయితే.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందున్నా విద్యాసంస్థల అ«ధినేత ఆసక్తిగా ఉండడంతో కాంగ్రెస్ పెద్దలు ఈయన పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
ఇద్దరు టీజేఏసీ నేతల సస్పెన్షన్
హైదరాబాద్: తమ నేతలు పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్ ను జేఏసీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజేఏసీ) ప్రకటించింది. మంగళవారం జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రజల సమస్యలు పరిష్కరించే బదులు, ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న శక్తులను బలహీన పరచాలని నేతలు ప్రయత్నించారని ఆరోపించింది. దీనికోసం అనైతిక పద్ధతుల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపింది. ప్రజాస్వామిక విలువలపై కనీస గౌరవమున్న వారు చేసేపని ఇది కాదని పేర్కొంది. దీంతో పాటు ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణిని ఖండించింది. ప్రభుత్వ ప్రలోభాలకు తలొగ్గి కొందరు చేస్తున్న ప్రకటనలతో జేఏసీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని, వీటివల్ల జేఏసీ తన కార్యాచరణను మరింత బలంగా ప్రజలలోకి తీసుకుపోవడానికి అవకాశం ఏర్పడిందని అభిప్రాయపడింది. నిరుద్యోగ నిరసన ర్యాలీ తదనంతర పరిణామాలపై టీజేఏసీ ఈ మేరకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఆ ర్యాలీ విజయవంతం కావడం, జేఏసీ ప్రజల బలమైన గొంతుకగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని పాలకులు తమ కుట్రలను తీవ్రతరం చేశారని ఆరోపించింది. కాగా, కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీ ఫీజులు యథేచ్ఛగా పెంచుతుండటంతో ప్రజలపై తీవ్ర భారం పడుతోందని, అయితే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం చట్ట పరిధిలో ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఫీజుల నియంత్రణకు కార్యాచరణ చేపట్టాలని జేఏసీ నిర్ణయించినట్లు వెల్లడించింది. బడ్జెట్ ను అధ్యయనం చేసి బలహీన వర్గాలకు కేటాయించిన నిధుల తరలింపును వెలుగులోకి తేవాలని జేఏసీ తీర్మానించింది. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లాల యాత్రలు చేపట్టాలని, దీనికి సంబంధించిన తేదీలను త్వరలోనే నిర్ణయించి ప్రకటించనున్నట్లు వివరించింది. -
పన్నీర్ కు మరో షాక్.. నలుగురిపై వేటు!
చెన్నై: సుప్రీంకోర్టు తీర్పుతో తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన శశికళ వర్గం.. ఆయనకు మరో షాకిచ్చింది. ఆయనకు మద్ధతిస్తున్న మరో నలుగురు నేతలపై పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ కు గురైన వారిలో విద్యాశాఖ మంత్రి కె.పాండ్యరాజన్, సీనియర్ నేత సి.పొన్నేయన్ సహా సీహెచ్ పాండ్యన్, ఎన్ విశ్వనాథన్ ఉన్నారు. మహాబలిపురం సమీపంలోని కూవత్తూరులోని గోల్డెడ్ బే రిసార్టుకు వెళ్లి, ఆ నేతలను పన్నీర్ కు మద్ధతు తెలపాలని కోరాలని భావించారు. రిసార్టుకు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీసెందుకు పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటేసినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పన్నీర్ సెల్వం వర్గంలో ఆయనతో కలిసి ప్రస్తుతం పది మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు (లోక్ సభ, రాజ్యసభ) ఉన్నారు. శశికళ వర్గం మాత్రం పన్నీర్ కు సీఎం కూర్చీ ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. అమ్మ జయలలిత ఆశయ సాధన కోసం పనిచేయాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పనులలో నిమగ్నమవ్వాలంటూ శశికళకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడయిన తర్వాత పన్నీర్ సెల్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై శశికళ వర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. మరోవైపు రిసార్టులో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలు శశికళ వర్గం తరఫున అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా రాష్ట్ర రహదారులు, ఓడ రేవుల మంత్రిగా ఉన్న కె.పళనిస్వామిని ఎన్నుకున్నారు. తమిళనాడు రాజకీయాలు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు నేనేంటో అసెంబ్లీలో చూపిస్తా: సెల్వం జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! గోల్డెన్ బే రిసార్ట్ వద్ద హైడ్రామా ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం?