పంపకాలు తెగలేదు.. పొత్తు ఊగిసలాట!! | Seat sharing talks between DMK, Congress remain inconclusive | Sakshi
Sakshi News home page

పంపకాలు తెగలేదు.. పొత్తు ఊగిసలాట!!

Published Sat, Mar 26 2016 1:22 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Seat sharing talks between DMK, Congress remain inconclusive

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ కాంగ్రెస్‌-డీఎంకే మధ్య సీట్ల పంపకాలు మాత్రం ఓ కొలిక్కిరావడం లేదు. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల గురించి డీఎంకే అధినేత కరుణానిధితో ముచ్చటించేందుకు ఢిల్లీ దూతగా గులాం నబీ ఆజాద్‌ వచ్చారు. ఆజాద్‌ శుక్రవారం చెన్నైలోని కరుణానిధి నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. అయినా ఈ భేటీలో సీట్ల పంపకాలు గురించి పెద్దగా ముందడుగు పడినట్టు కనిపించడం లేదు

ప్రస్తుతం ఎన్నికల వ్యూహాలు, ప్రణాళికల గురించే కరుణానిధితో తాను  చర్చించానని, ఇంకా సీట్ల పంపకాల గురించి మాట్లాడలేదని కాంగ్రెస్‌ సీనియర్ నేత ఆజాద్ తెలిపారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీచేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా వెళ్లాలని కాంగ్రెస్, డీఎంకే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

పొత్తు కోసం పాకులాట!
తమిళనాడులో బీజేపీ పరిస్థితి ఒంటరి ఏకాకిలా మారింది. ఆ పార్టీ పొత్తు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. ఎవ్వరూ దానిని అక్కున చేర్చుకోవడం లేదు. ముఖ్యంగా విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేపై బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. కానీ ఆ ఆశలను అడియాసలు చేస్తూ.. ఆయన ప్రజాసంక్షేమ కూటమితో జత కలిశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎండీకే, పీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు ఒక మిత్రపక్షం చేజారిపోగా.. మరో మిత్రపక్షం పీఎంకే ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పీఎంకేతోనైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement