నల్లధనం కేసులో భారత ప్రభుత్వం మూడు బ్యాంకులపై దృష్టిసారిస్తోంది.
న్యూఢిల్లీ: నల్లధనం కేసులో భారత ప్రభుత్వం మూడు బ్యాంకులపై దృష్టిసారిస్తోంది. నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో దేశంలోకి మళ్లీ తరలిస్తున్నారని సెబీ గుర్తించింది. ఈ దిశగా ముమ్మరంగా దర్యాప్తు చేపట్టింది.
రెండు స్విస్ బ్యాంకులు, ఒక యూరప్ బ్యాంక్పై సెబీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 15-20 భారతీయ కంపెనీలపై సందేహాలున్నాయని ఓ సీనియర్ అధికారి చెప్పారు. బ్లాక్మనీ దర్యాప్తు కేసుతో స్విస్ బ్యాంకుల్లో ఆందోళన నెలకొంది. నల్లధనానికి సంబంధించి భారత్తో ఒప్పందం ఉండేలా చూడాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.