న్యూఢిల్లీ: అధికార రహస్యాల చట్టంలోని నిబంధనలను పునఃపరిశీలించాలని ముగ్గురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. ఆర్టీఐ, అధికార రహస్యాల చట్టంపై సమీక్షకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ గురువారం తొలిసారి సమావేశమైంది. రహస్యాల చట్టాన్ని సవరించాలంటూ ఇంతకుముందు వచ్చిన పలు సలహాలను పరిశీలించాలని కమిటీలో నిర్ణయించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించిన పత్రాలు బయపెట్టాలన్న డిమాండ్ నేపథ్యంలో కేంద్రం హోం, న్యాయ, సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
‘రహస్య’ నిబంధనలపై పునఃపరిశీలన
Published Fri, Apr 17 2015 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM
Advertisement
Advertisement