
సాక్షి, యూపీ: వరుస ప్రమాదాలకు నిలయంగా మారిన ఉత్తర ప్రదేశ్ లో మరో రైలు పట్టాలు తప్పింది. హౌరా-జబల్ పూర్ మధ్య నడిచే శక్తికుంజ్ ఎక్స్ ప్రెస్ సోన్ బాంద్రా వద్ద ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
గురువారం వేకువ ఝామున ఒబ్రా రైల్వే స్టేషన్ వద్ద రైలుకు సంబంధించి ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెబుతున్నారు. పట్టా విరిగిపోయి ఉండటంతో ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
కాగా, సురేష్ ప్రభు నుంచి పీయూష్ గోయల్ పదవీ బాధ్యతలు చేపట్టాక చోటు చేసుకున్న తొలి ప్రమాదం ఇదే. ఘటనపై మంత్రి గోయల్ కు పూర్త సమాచారం అందించామని రైల్వే పీఆర్వో తెలిపారు. ఉదయం 6.25 సమయంలో ఘటన చోటు చేసుకుందని, మిగతా బోగీల్లో ప్రయాణికులను తరలించినట్లు ఆయన వివరించారు.
