బీజేపీ, శివసేనల మధ్య తొలగిన విభేదాలు!
న్యూఢిల్లీ: మంత్రి పదవుల కేటాయింపుల వ్యవహారంలో బీజేపీ, శివసేనల మధ్య చోటుచేసుకున్న విభేదాలు పరిష్కారమయ్యాయి. ప్రధాని నర్మేంద్ర మోడీతో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. దాంతో శివసేన కు కేటాయించిన భారీ పరిశ్రమల శాఖను చేపట్టేందుకు అనంత్ గీతే అంగీకరించారు. బుధవారం ఉదయం 11 గంటలకు గీతే మంత్రి పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.
మంత్రి పదవుల కేటాయింపుపై ప్రస్తుతం ఎలాంటి అసంతృప్తి లేదు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కీలక పదవులు దక్కేలా పార్టీ దృష్టిపెట్టింది అని గీతే మీడియాతో అన్నారు. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గీతే.. తనకు కేటాయించిన భారీ పరిశ్రమల శాఖను చేపట్టేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఇరుపార్టీల మధ్య విబేధాలు నెలకొన్నాయి. అయితే మోడీ, ఉద్దవ్ లు ఓ అవగాహనకు రావడంతో తాత్కాలికంగా విభేదాలను పక్కన పెట్టారు.