ముంబై : ఖలాపూర్ సమీపంలోని ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర ప్రమాదం జరిగింది. ఆరు వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడగా.. భారీ ఎత్తున్న ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎప్పుడూ బిజీగా ఉంటే ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టోల్‌ప్లాజా సమీపంలో కంటైనర్ ట్రక్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, ఈ వాహనాలన్నీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. వేగంగా వెళ్తున్న కంటైనర్ ట్రక్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ఈ కంటైనర్‌గా వెనుకాల వస్తున్న వాహనాలకు సడెన్‌గా బ్రేక్ వేసే అవకాశం లేకపోవడంతో పాటు, పరిస్థితిని గమనించని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. గాయపడ్డ వారిని వెంటనే పాన్వెల్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సంభవించిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ముంబై ట్రాఫిక్ పోలీసు, ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు. గత నెలలో కూడా ఇదే ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం జరుగగా.. పెళ్లి వేడుకకు వెళ్లి వస్తున్న ఐదుగురు చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment