
ముంబై: మహారాష్ట్రలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్ వే మీద ఖోపోలికి సమీపంలో ప్రయాణిస్తున్న పలు వాహనాలు ఒక్కసారిగా ఒక దాని వెంటనే మరోకటి వేగంగా వెళ్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి: నీటి కుంటలో శవమై తేలిన నన్