Mumbai Pune Expressway
-
22ఏళ్ళ క్రితం నిర్మించారు.. ఇప్పటికీ అక్కడ టోల్ ట్యాక్స్ ఎక్కువే!
ఎక్స్‌ప్రెస్‌వే లేదా హైవేలలో ప్రయాణిస్తే టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిందే. అయితే దేశంలో ఎక్కడైనా టోల్ ట్యాక్స్ ఒకేలా ఉంటుంది. కానీ మన దేశంలోని ఓ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ప్రయాణించాలంటే కొంత ఎక్కువ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ ఎక్స్‌ప్రెస్‌వే ఏది? సాధారణ హైవే మీదకంటే ఇక్కడ ఎంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.దేశంలో అత్యంత ఖరీదైన ఎక్స్‌ప్రెస్‌వే ఏది అంటే చాలామంది చెప్పే సమాధానం 'ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే'. దీన్ని 22 సంవత్సరాల క్రితం నిర్మించారు. కాబట్టి దేశంలో అతి పురాతనమైన, మొదటి ఎక్స్‌ప్రెస్‌వేగా దీన్ని పరిగణిస్తారు. 2002లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నిర్మించారు. ఈ రహదారి మహారాష్ట్రలోని అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఒకటైన ముంబైని పూణేకి కలుపుతుంది.ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే అనేది దేశంలోనే మొదటి 6 లేన్ల రోడ్ కూడా. ఈ రోడ్డు నిర్మాణానికి అప్పట్లో రూ. 163000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీని పొడవు 94.5 కిలోమీటర్లు. ఇది నవీ ముంబైలోని కలంబోలి ప్రాంతం నుంచి ప్రారంభమై పూణేలోని కివాలే వద్ద ముగుస్తుంది. దీన్ని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించింది.ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన తరువాత ముంబై & పూణే మధ్య ప్రయాణించే సమయాన్ని మూడు గంటల నుంచి 1 గంటకు తగ్గించింది. అంటే ఈ రోడ్డుపై ప్రయాణించేవారు రెండు గంటల సమయాన్ని ఆదా చేయవచ్చు. కాబట్టి ఎక్కువమంది ఈ హైవే మీద ప్రయాణిస్తూ ఉంటారు. సహ్యాద్రి పర్వత శ్రేణిలో నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే సొరంగాలు, అండర్ పాస్‌లను కలిగి ఉంది.టోల్ ట్యాక్స్ప్రారంభంలో చెప్పుకున్నట్లుగానే ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే అత్యంత ఎక్కువ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఇక్కడ కిలోమీటరుకు రూ. 3.40 వసూలు చేస్తుంది. ఇతర ఎక్స్‌ప్రెస్‌వేల మీద ఈ ఛార్జ్ కేవలం రూ. 2.40 మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఛార్జ్ ఎంత ఎక్కువ వసూలు చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది.టోల్ ట్యాక్స్ ఎక్కువగా వసూళ్లు చేయడానికి కారణం!ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి భారీగా ఖర్చు చేశారు, అంతే కాకుండా ఇప్పుడు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. అయితే ప్రారంభంలో ప్రైవేట్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం కూడా ఈ ఛార్జెస్ పెరుగుదలకు కారణమనే తెలుస్తోంది. ట్రాఫిక్ వాల్యూమ్, ప్రభుత్వ పన్నులు మొదలైనవి కూడా టోల్ ఫీజు ఎక్కువగా వసూలు చేయడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. -
ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై ఆయిల్ ట్యాంకర్‌కు మంటలు
-
ముంబై,పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
-
వీడియో: ముంబైలో ఒళ్లు గగుర్పొడిచే ఘోర ప్రమాదం
ముంబై: మహారాష్ట్రలోని ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్లున్న ఓ కారు రెండు లారీ కంటెనర్ల మధ్య చిక్కుకుంది. దీంతో అదుపు తప్పిన వేగంతో ఓ లారీ ముందున్న కారును ఘోరంగా ఢీకొట్టి కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. లారీ కింద పడ్డ కారు నుజ్జునుజ్జు అయి మంటలు చెలరేగి కాలిపోయింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో లారీ కారుపైకి దూసుకురావటంతో ఈ ప్రమాదం చేటు చేసుకుంది. గురువారం చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదం ఘటనలో మృతి చెందినవారిలో నాలుగేళ్ల బాలుడు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం
ముంబై: మహారాష్ట్రలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్ వే మీద ఖోపోలికి సమీపంలో ప్రయాణిస్తున్న పలు వాహనాలు ఒక్కసారిగా ఒక దాని వెంటనే మరోకటి వేగంగా వెళ్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: నీటి కుంటలో శవమై తేలిన నన్ -
ప్రాణం పోతున్నా కన్నెత్తి చూడలేదు..!
సాక్షి, ముంబై : ప్రాణం కన్నా మనిషికి మనీయే ముఖ్యమనే రోజులు దాపురించాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ ట్రక్ డ్రైవర్ ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంటే.. ఒక్కరంటే ఒక్కరూ పట్టించుకున్న పాపానపోలేదు. తేరగా వచ్చేది వదులుకుంటామా అని దొరికినన్ని ఉల్లిపాయల్ని దోచుకెళ్లారు. విషాదమేంటంటే.. అటుగా వెళ్తున్న ఇతర ట్రక్ డ్రైవర్లు సైతం గాయపడిన క్షతగాత్రునివంక కన్నెత్తి చూడలేదు. అందరూ అతని వాహనంలోని ఉల్లిపాయల్ని దోచుకునే పనిలో పడ్డారు. ఈ ఘటన ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ రహదారిపై గల వాల్వన్ బ్రిడ్జి వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పిందని, చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి గురైన వాహనం ఉల్లిపాయల లోడుతో ముంబై నుంచి పుణె వెళుతోందని పోలీసులు తెలిపారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో డివైడర్ ఢీకొట్టి ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయింది. దాదాపు 30 మీటర్ల ఎత్తు నుంచి వాహనం కిందపడడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. -
సిటీ చుట్టూ సూపర్ హైవే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను మామూలు రహదారిలా కాకుండా ప్రపంచ స్థాయి ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సంగారెడ్డి–గజ్వేల్–చౌటుప్పల్–మాల్–కడ్తాల్–షాద్‌నగర్–చేవెళ్ల–కంది పట్టణాలను కలుపుతూ 500 అడుగుల వెడల్పుతో 338 కిలో మీటర్ల పొడవుతో ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరగాలన్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేయాలని చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి నిధుల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వంతో తానే స్వయంగా మాట్లాడతానన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై సీఎస్ ఎస్.కె.జోషి, రోడ్లు–భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, ఇతర అధికారులతో గురువారం ప్రగతిభవన్‌లో సీఎం చర్చించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో ఫోన్లో మాట్లాడారు. ‘‘ముంబై–పుణే, అహ్మదాబాద్–వదోదర మధ్య ప్రస్తుతమున్న ఎక్స్‌ప్రెస్‌వేల కన్నా మన రీజనల్ రింగ్ రోడ్డు గొప్పగా ఉండాలి. విజయవాడ, ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్‌లకు వెళ్లే జంక్షన్లను బాగా అభివృద్ధి చేయండి. ఈ నాలుగు కూడళ్ల వద్ద ప్రభుత్వం 300 నుంచి 500 ఎకరాల వరకు సేకరిస్తోంది. ఆ స్థలంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించండి. పార్కింగ్, ఫుడ్ కోర్టులు, రెస్ట్ రూమ్‌లు, పార్కులు, పిల్లలు ఆడుకునే స్థలాలు, షాపింగ్ మాళ్లు, మంచినీరు, టాయిలెట్లు ఇలా అన్నీ ఏర్పాటు చేయండి. మంచి రహదారులు, రహదారుల పక్కన అన్ని సౌకర్యాలున్న దేశాల్లో పర్యటించి అధ్యయనం చేయండి’’ అని అధికారులకు సూచించారు. దేశంలోనే గొప్ప కాస్మొపాలిటిన్ నగరం హైదరాబాద్ అని, ఇక్కడి వాతావరణం, సామరస్య జీవనం వల్ల నగరం మరింతగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు పెరుగుతున్నాయని, ఈ దృష్ట్యా ఇప్పుడున్న ఓఆర్ఆర్ భవిష్యత్ అవసరాలు తీర్చలేదని, అందుకే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దేశంలోనే గొప్ప రహదారిగా ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్నామని వెల్లడించారు. -
ముంబై : ఒకేసారి ఆరు వాహనాలు ‘ఢీ’
ముంబై : ఖలాపూర్ సమీపంలోని ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర ప్రమాదం జరిగింది. ఆరు వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడగా.. భారీ ఎత్తున్న ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎప్పుడూ బిజీగా ఉంటే ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టోల్‌ప్లాజా సమీపంలో కంటైనర్ ట్రక్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, ఈ వాహనాలన్నీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. వేగంగా వెళ్తున్న కంటైనర్ ట్రక్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ఈ కంటైనర్‌గా వెనుకాల వస్తున్న వాహనాలకు సడెన్‌గా బ్రేక్ వేసే అవకాశం లేకపోవడంతో పాటు, పరిస్థితిని గమనించని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. గాయపడ్డ వారిని వెంటనే పాన్వెల్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సంభవించిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ముంబై ట్రాఫిక్ పోలీసు, ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు. గత నెలలో కూడా ఇదే ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం జరుగగా.. పెళ్లి వేడుకకు వెళ్లి వస్తున్న ఐదుగురు చనిపోయారు. -
పరోపకారం చేసేందుకు పోయి..
ముంబై: తనకు సంబంధించిన వారు కాకపోయినా ప్రాణాపాయ స్థితిలో ఉంటే జాలి పడి.. మానవతా దృక్పథంతో వారికి సాయం చేసేందుకు వెళ్లాడు. దురదృష్టవశాత్తూ అదే దారిలో వేగంగా వెళ్తున్న కారు ఆయన్ను ఢీకొంది. అయితే ఆయనకున్న మానవత్వం కారులోని వ్యక్తులకు లేకపోయింది. తమ కళ్లెదుటే.. తమ కారణంగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడితే ఏమాత్రం కనికరంలేకుండా కారు ఆపకుండా వెళ్లిపోయారు. పరోపకారం చేసేందుకు వచ్చిన ఆ వ్యక్తి తీవ్రగాయాలతో మరణించాడు. ఈ విషాదకర సంఘటన ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో జరిగింది. ఆదివారం ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో అదోషీ టన్నల్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద బండరాళ్ల కింద చిక్కి వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. ఖొపోలి గ్రామానికి చెందిన గణపత్ కుడ్పనె (32) అనే వ్యక్తి ఈ విషయం తెలుసుకుని బాధితులకు సాయం చేసేందుకు వెళ్లాడు. అదే దారిలో వెళ్తున్న కారు ఆయన్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మరణించాడు. కాగా కారులోని వ్యక్తులు వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. ఖొపోలి పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రమాద‘కారు’లు
సాక్షి, ముంబై: ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం కార్లలో ప్రయాణిస్తున్న వారే మృతి చెందారు. రోడ్డు ప్రమాదానికి గురైన వివిధ వాహనాల్లో మరణించిన సంఖ్యతో పోలిస్తే వీరి సంఖ్య 58 శాతం ఉన్నట్లు ‘జేపీ రీసెర్చ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ నిర్వహించిన అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదాలు, అందులో మృతుల సంఖ్య పెరగడానికి గల ప్రధాన కారణాలను తెలుసుకునేందుకు ఇటీవల కోయంబత్తూర్‌కు చెందిన జేపీ రీసెర్చ్ కంపెనీ సర్వే చేసింది. వాహనాలు అధిక వేగంగా వెళ్లే రహదారిగా గుర్తింపు పొందిన ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వే పై ఏటా కొన్ని వందల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో వేల సంఖ్యలో అమాయకులు మృతి చెందుతున్నారు. వీటిని అరికట్టేందుకు జాతీయ రహదారుల శాఖ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మానవ తప్పిదమో, లేక సాంకేతిక లోపమో కానీ పూర్తిగా నియంత్రించలేకపోతున్నారు. దీంతో అసలు ఈ ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయోనని వివరాలు తెలుసుకునేందుకు జేపీ రీసెర్చ్ కంపెనీ సర్వే చేపట్టింది. 2012 నవంబర్ నుంచి 2013 అక్టోబర్ వరకు 214 రోడ్డు ప్రమాదాలను అధ్యయనం చేసింది. ఇందులో ముంబై-పుణే న గరాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలే ఎక్కువ ప్రమాదాలకు గురయ్యాయి. ఇవి కామ్‌శేత్ ఘాట్ పరిసరాల్లోనే జరిగాయి. 55 శాతం ప్రమాదాలు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల, 46 శాతం సీటు బెల్టు పెట్టుకోకపోవడంవల్ల జరిగాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల లోపు జరిగిన ప్రమాదాలు 58 శాతం ఉన్నాయి. ట్రక్కు డ్రైవర్ల నిద్రమత్తు డ్రైవింగ్ వల్ల 75 శాతం ప్రమాదాలు జరిగాయి. మొత్తం ప్రమాదాల్లో 81.5 శాతం మానవ తప్పిదంతో, మిగతావి వాహనాల సాంకేతిక లోపంతో జరిగాయి. రోడ్లు, మౌలిక సదుపాయాల కొరతవల్ల 24.9 శాతం ప్రమాదాలు జరిగినట్లు జేపీ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. మొత్తంగా అత్యధిక శాతం ప్రమాదాలు డ్రైవర్లకు నిద్రముంచుకురావడం వల్లే జరిగాయని తుది నివేదికలో వెల్లడించింది. ఈ రహదారిపై జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 67 శాతం కేసులు నమోదు చేయలేద ని తెలిపింది. ఫలితం లేని ప్రచార కార్యక్రమాలు ప్రాణం ఎంతో విలువైంది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఏటా రోడ్డు భద్రతా వారోత్సవాలు, ఇతర ప్రచార కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. తొందరగా గమ్యస్థానానికి చేరుకోవాలనే తపన, అందుకు వాహన వేగాన్ని పెంచడం, విశ్రాంతి లేకుండా డ్రైవర్ వాహనాన్ని డ్రైవింగ్ చేయడం తదితర కారణాలు ప్రమాదాలకు ఊతమిస్తున్నాయి. ఫలితంగా అమాయకులు ఇందులో ప్రాణాలు కోల్పోతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
పింప్రి, న్యూస్‌లైన్: పుణే-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. తలేగావ్ దాబోడే లోని వర్సే టోల్‌నాకా వద్ద నాలుగు వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ మార్గంలో వెళుతున్న టెంపోను ఇన్నోవా కార్ ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. దీని వెనుక నుంచి వస్తున్న అల్టో కారు ఇన్నోవాను ఢీకొట్టింది. ఆల్టోను దీని వెనక నుంచి వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఆల్టోకారులో ఉన్న నలుగురు మృతి చెందారు. వీరు ముంబై నుంచి నుంచి పుణేకు తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. మృతులను పుణేలోని కోత్‌రోడ్డుకు చెందిన అడ్వొకేట్ సతీష్ పోహర్కర్ (49), చించ్వాడ్లోని హెల్కోరోడ్డుకు చెందిన రాజేష్ రామ్‌లఖన్ (40), ఉసారికాలనీలోని శోభా విహార్‌కు చెందిన రాజేష్ బాలామ్కర్ (45), సింహగఢ్ రోడ్డులోని ఆనంద్‌నగర్‌కు చెందిన అనిల్ వాసుదేవ్ చవాన్(40)గా గుర్తించారు. తలేగావ్ దాబోడే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.