పింప్రి, న్యూస్‌లైన్: పుణే-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. తలేగావ్ దాబోడే లోని వర్సే టోల్‌నాకా వద్ద నాలుగు వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ మార్గంలో వెళుతున్న టెంపోను ఇన్నోవా కార్ ఓవర్‌టేక్ చేయబోయి ఢీకొట్టింది. దీని వెనుక నుంచి వస్తున్న అల్టో కారు ఇన్నోవాను ఢీకొట్టింది. ఆల్టోను దీని వెనక నుంచి వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఆల్టోకారులో ఉన్న నలుగురు మృతి చెందారు. వీరు ముంబై నుంచి నుంచి పుణేకు తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. మృతులను పుణేలోని కోత్‌రోడ్డుకు చెందిన అడ్వొకేట్ సతీష్ పోహర్కర్ (49), చించ్‌వాడ్‌లోని హెల్కోరోడ్డుకు చెందిన రాజేష్ రామ్‌లఖన్ (40), ఉసారికాలనీలోని శోభా విహార్‌కు చెందిన రాజేష్ బాలామ్కర్ (45), సింహగఢ్ రోడ్డులోని ఆనంద్‌నగర్‌కు చెందిన అనిల్ వాసుదేవ్ చవాన్(40)గా గుర్తించారు. తలేగావ్ దాబోడే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.